: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న సూపర్ స్టార్ కృష్ణ మనవడు


తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికైనా సరే సూపర్ స్టార్ అంటే కృష్ణనే. మూడు దశాబ్దాల పాటు ఆయన వెండితెరపై మెరిశారు. ఆయన తర్వాత ఆయన నటవారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు ఎంటరయ్యాడు. ఈ తర్వాత అదే కుటుంబం నుంచి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో అందాల నటుడు ఆ ఇంటి నుంచి సినీ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. అతను మరెవరో కాదు... కృష్ణ కుమార్తె, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ల కుమారుడు గల్లా అశోక్. ఇప్పటికే నటనలో శిక్షణ పొందిన అశోక్... మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరో విషయం ఏమిటంటే... అశోక్ తెరంగేట్రం తమ సొంత బ్యానర్ లోనే ఉంటుందని గల్లా జయదేవ్ కూడా ప్రకటించారు.

  • Loading...

More Telugu News