: మరింత విషమించిన కరుణానిధి ఆరోగ్యం... చెన్నై వెళ్లి పరామర్శించిన రాహుల్ గాంధీ
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించింది. కరుణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని తెలియడంతో, రాహుల్ గాంధీ హుటాహుటీన చెన్నైవెళ్లి, ఆయనను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాహుల్ వెంట, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా, కరుణ కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి కన్నీరుమున్నీరు అయ్యారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గత రెండు రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కరుణ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో 'ట్రక్యోస్టమీ' అనే పరికరం సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. యాంటీబయొటిక్స్ అందిస్తున్నారు. కరుణానిధి ప్రస్తుత వయస్సు 93 ఏళ్లు.