: బీజింగ్ లో పొల్యూషన్ అలర్ట్... 1200 ఫ్యాక్టరీలు మూసివేత


చైనా రాజధాని బీజింగ్ కాలుష్యకోరల్లో చిక్కుకుంది. వాతావరణ కాలుష్యంతో బీజింగ్ ప్రజలు ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతులేకుండా కొనసాగిన పారిశ్రామికీకరణే దీనికి కారణం. దీంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లుతున్న 1200 ఫ్యాక్టరీలపై కొరడా ఝళిపించింది. వీటిలో 700 కంపెనీలు కచ్చితంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన 500 కంపెనీలు మూసివేయడమో, లేదా ఉత్పత్తిని తగ్గించుకోవడమో చేయాలని ఆదేశించింది. ఫ్యాక్టరీలు వదులుతున్న కాలుష్యంతో... ఉత్తర చైనాను దట్టమైన కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో, నిన్న అర్ధరాత్రి పర్యావరణ నిపుణులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News