: మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి విషమం
మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో అతనికి చికిత్స అందించాలంటూ ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ డాక్టర్లు సూచించారని... రాజన్ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ సూచన చేశారని తెలుస్తోంది. దీంతో, అతనికి ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నట్టు సమాచారం.
మూత్రపిండాలు, గుండె సమస్యలతో బాధపడుతున్న ఛోటా రాజన్ కు హైపర్ టెన్షన్, లాపరోటమీ, ఇన్సిషనల్ హెర్నియాలు కూడా ఉన్నాయట. దీనికి తోడు అప్పుడప్పుడు కడుపునొప్పి, ముక్కులో నుంచి రక్తం కూడా వస్తోందట. కొన్నిసార్లు అసలు నిద్ర కూడా పట్టదట. రాజన్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కోర్టు... అతనికి సరైన చికిత్స అందించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.