: తెలంగాణ శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా సస్పెన్షన్ వేటు


తెలంగాణ శాసనసభ సమావేశాల్లో, రెండవ రోజు ప్రారంభంలోనే సస్పెన్షన్ల పర్వం ప్రారంభమయింది. సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వాయిదా తీర్మానాలపై చర్చను చేపట్టాలని వీరు డిమాండ్ చేయడంతో... వీరిని సస్పెండ్ చేశారు. 

  • Loading...

More Telugu News