: టీఎస్ అసెంబ్లీ... 9 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్


తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ వారిస్తున్నా వారు పట్టించుకోలేదు. దీంతో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ సభ్యులు విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఉనికిని చాటుకోవడానికే వీరు సభను అడ్డుకుంటున్నారని తెలిపారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ సభ్యులను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో, మొత్తం 9 మంది కాంగ్రెస్ సభ్యులను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారు వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

సస్పెండైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే...
డీకే అరుణ, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతి రెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, రామ్మోహన్ రెడ్డి. రెండో రోజు సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే వీరు సస్పెండ్ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News