: మా పెద్దమ్మను హత్య చేశారు: జయలలిత సోదరి కుమార్తె ఆరోపణ


తమ పెద్దమ్మ జయలలితది సహజ మరణం కాదని... ఆమె మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని జయ సోదరి కుమార్తె అమృత డిమాండ్ చేశారు. తమ పెద్దమ్మను కనీసం కలుసుకోవడానికి కూడా వీలులేకుండా శశికళ తమను దూరం పెట్టారని ఆమె ఆరోపించారు. తమ పెద్దమ్మ అంత్యక్రియలను ఈ రకంగా చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరంగపట్టణంలో జయ ఉత్తర క్రియలను అమృత, ఆమె బంధువులు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. 

  • Loading...

More Telugu News