: సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో.. మనీలాండరింగ్ ఆరోపణలపై రతన్ టాటాపై కేసు నమోదు
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో టాటా గ్రూపు అధినేత రతన్ టాటాపై కేసు నమోదు చేశారు. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందేందుకు రతన్ టాటా నాడు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ స్పెషల్ సీబీఐ కోర్టులో ఈరోజు ఆయన ఫిర్యాదు చేశారు. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్ కేటాయింపు కుంభకోణం కేసులో మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా తదితరులను విచారించాలని ఆ ఫిర్యాదులో ఆయన కోరారు. ఈ కేసులో గుర్తుతెలియని సీబీఐ అధికారులు టాటాలను రక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ స్వీకరించారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే జనవరి 11కు వాయిదా వేశారు.