: పెరిగిన ‘పెట్రో’ ధరలు.. లీటర్ పెట్రోల్ పై రూ.2.21 పైసల వడ్డన
‘పెట్రో’ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.2.21 పైసలు, డీజిల్ పై రూ.1.79 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు చమురు సరఫరాను తగ్గించాలని నిర్ణయించడంతో ‘పెట్రో’ ధరలు భారీగా పెరగనున్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా హల్ చల్ చేశాయి.