: నాన్న చనిపోయాక ఆయనలా నాకు అండగా నిలిచిన వ్యక్తి జంగన్న: జగన్


తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి చనిపోయిన తర్వాత ఆయనలా తనకు అండగా నిలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి అని జగన్ అన్నారు. నరసరావుపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాసు మహేశ్ రెడ్డిని పార్టీలోకి తీసుకునేముందు జంగా కృష్ణమూర్తితో మాట్లాడానని, చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామని కోరానని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే కచ్చితంగా జంగన్నను చట్టసభల్లోకి తీసుకువస్తానని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. ప్రతికార్యకర్త తమ నాయకుడు ఫలానా వాడని తలెత్తుకుని తిరగాలని, కానీ, చంద్రబాబును చూసి ఆ పార్టీ కార్యకర్తలు సిగ్గుతో తలదించుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు.
 

  • Loading...

More Telugu News