: చంద్రబాబుకు మోదీ అంటే వణుకు!: జగన్


'ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి వణుకు' అని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తన అవినీతిపై మోదీ విచారణ చేయిస్తారని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే, మోదీని చంద్రబాబు నిలదీయరని విమర్శించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధం ఆడతారని, రాష్ట్రాన్ని ఆయన అడ్డగోలుగా అమ్మేస్తున్నారని, ఏపీలో బ్లాక్ మనీతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనాలని అనుకున్నారని, ఇందుకు సంబంధించిన ఆడియోలు విన్నామని, వీడియో టేపులు చూశామని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు అందరూ ఏకం కావాలని, అందరూ ఒక్కటిగా నిలిచి మహేశ్ రెడ్డిని ఆశీర్వదించాలని జగన్ కోరారు.  

  • Loading...

More Telugu News