: ఈ సినిమా షూటింగ్‌కి ప్రకృతి సైతం సహకరించింది!: నందమూరి బాలకృష్ణ
'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ట్రైలర్ విడుదల అయిన సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ... తన గురించి తెలిసిన కొందరు తనను ‘డాక్టర్ అయ్యే వాడు యాక్టర్ అయ్యాడు’ అనుకుంటారని.. కానీ అది నిజం కాదని, తనకు చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలనే ఉండేదని, అలాగే అయ్యానని అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి మాటల రచయిత సాయిమాధవ్ అద్భుతంగా డైలాగులు రాశారని, ఆయన ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారని, సాయిమాధవ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని బాలయ్య అన్నారు.
తాను ఎన్నో సినిమాలు చేశానని, పౌరాణిక, జానపద, సాంఘిక, సందేశాత్మక సినిమాలు చేశానని, తన వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా లభించడం ఆనందంగా ఉందని బాలయ్య అన్నారు. సినిమా షూటింగ్‌కి ప్రకృతి సైతం సహకరించిందని, దేశంలో ఎన్నో చోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ తాము షూటింగ్ జరుపుతున్న ప్రాంతంలో మాత్రం వర్షాలు పడలేదని, ఆ విధంగా ప్రకృతి తమకు సహకారం అందించిందని అన్నారు.