: సభా సమయం వృథా కావడానికి సభ్యులందరూ కారణమే: ఉప రాష్ట్రపతి
సభా సమయం వృథా కావడానికి సభ్యులందరూ కారణమేనని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చివరిరోజు అయిన నేడు రాజ్యసభ జరిగిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఒకట్రెండు రోజులు స్వల్ప చర్చలు జరగడం మినహా, మిగిలిన సమయం అంతా వృథా అయిందని, అందుకు అన్ని పార్టీల సభ్యులూ కారణమేనని అన్నారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని, భవిష్యత్తులో నైనా సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.