: ఏపీలో ఎక్సైజ్ ఆదాయానికి గండి పడింది : మంత్రి కొల్లు రవీంద్ర


పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఏపీలో ఎక్సైజ్ ఆదాయానికి భారీగా గండి పడిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.  ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నిర్ణయంతో ఏపీలో రూ.200 కోట్ల మేరకు ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిందని వెల్లడించారు. మద్యం దుకాణాల్లో పోస్ మెషీన్లు వినియోగించాలని, ఇప్పటికే 20 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని అన్నారు. వారం రోజుల్లోగా కొత్త బార్ విధానం తీసుకురానున్నట్టు, వెనుకబడిన తరగతుల్లోని వివిధ సమాఖ్యలకు రూ.354 కోట్లు రుణాలు మంజూరు చేయనున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.  
 

  • Loading...

More Telugu News