: చెన్నయ్ టెస్టు: క్రీజులో పాతుకుపోయి సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అలీ
చెన్నయ్ లో కొనసాగుతున్న భారత్, ఇంగ్లండ్ ఆఖరిటెస్టు మ్యాచులో ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జెన్నింగ్స్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔట్ కాగా, మరో ఓపెనర్ కెప్టెన్ కుక్ కూడా 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయిన సంగతి తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన రూట్ 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తరువాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన ఎంఎం అలీ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం క్రీజులో అలీ 111, స్టోక్స్ 5 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా, ఇషాంత్‌కి ఒక వికెట్టు దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 273 (86 ఓవర్లకి)గా ఉంది.