: రాజీనామా చేసే ఆలోచన లేదు: రతన్ టాటా
టాటా ట్రస్టుల ఛైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై రతన్ టాటా స్పందించారు. ఆ వార్తలన్నీ కేవలం ఊహాగానాలే అని... తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదని చెప్పారు. మరోవైపు దీనిపై టాటా గ్రూప్ కూడా స్పందించింది. టాటా గ్రూప్ తాత్కాలిక ఛైర్మన్ గా రతన్ టాటా ప్రస్తుతం కొనసాగుతున్నారని... టాటా ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోయే ఉద్దేశాలు ప్రస్తుతానికి లేవని ప్రకటించింది. టాటా ట్రస్టులో ఆయన కొనసాగుతారని చెప్పింది.