: అమెరికాలోని క్యూపర్టికో నగరానికి మేయర్ గా భారతి సంతతి మహిళ


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న క్యూపర్టికో పట్టణానికి తొలిసారిగా భారత సంతతికి చెందిన సవితా వైద్యనాథన్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాలు ఇవేనని చెప్పారు. గత 19 ఏళ్లుగా నవితా వైద్యనాథన్ క్యూపర్టికోలోనే ఉంటున్నారు. ఎంబీఏ చదివిన ఆమె... హైస్కూల్ లో టీచర్ గా పని చేశారు. కమర్షియల్ బ్యాంకులో అధికారిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. క్యూపర్టికోలో పలు కమ్యూనిటీలు నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. మేయర్ గా తొలి సంతకాన్ని విద్యకు సంబంధించిన ఫైల్ మీదే ఆమె చేశారు.

  • Loading...

More Telugu News