: తిరుపతిలో చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది . ఈ రోజు ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడ నుంచి తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించడానికి ఆయన బస్సులో బయల్దేరారు. అయితే, బస్సు అవిలాలకు చేరుకోగానే, ఇంజిన్ లో నుంచి పొగలు వచ్చి, బస్సు నిలిచిపోయింది. వెంటనే ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరో వాహనంలో ఆయనను అక్కడ నుంచి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.