: రణబీర్ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిన స్టార్ హీరో భార్య


బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. ముంబైలోని పాలి హిల్స్ ప్రాంతంలో రణబీర్ ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. అయితే, ఈ ఇంటికి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఇంటీరియర్ డిజైన్ చేయడం గమనార్హం. మంచి ఇంటీరియర్ డిజైనర్ గా గౌరికి పేరుంది. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ ప్రముఖులకు రణబీర్ కపూర్ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి కరణ్ జొహార్, గౌరీ ఖాన్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రణబీర్ తో కలసి దిగిన ఫొటోను గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొత్త ఇంటిని ఎంతో అందంగా తీర్చి దిద్దిన గౌరీ ఖాన్ కు రణబీర్ తల్లిదండ్రులు నీతూ కపూర్, రిషి కపూర్ లు కృతఙ్ఞతలు తెలిపారు. రణబీర్ కుటుంబ సభ్యులు చెంబూరులోని కపూర్ కాటేజ్ లో నివాసముంటున్నారు. 

  • Loading...

More Telugu News