: తన పేరుపై ఏకంగా 85 బ్యాంకు ఖాతాలు తెరిచాడు.. చివరికి దొరికిపోయాడు!
పెద్దనోట్ల తరువాత నల్లధనాన్ని మార్చుకోవడానికి నల్లకుబేరులు శతవిధాలా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు నిబంధనలకు విరుద్ధంగా చేస్తోన్న ఎన్నో చర్యలు బయటపడుతున్నాయి. పంజాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఓ వ్యాపారికి ఏకంగా 85 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని గుర్తించారు. వ్యాపారి ఈ ఖాతాల్లో ఎంత నల్లధనం దాచుకున్నాడనే అంశంపై వివరాలు తెలియాల్సి ఉంది. తాము చేస్తోన్న తనిఖీలకి ప్రజల నుంచి మద్దతు వస్తోందని, నల్లధనం కట్టలుకట్టలుగా దాచుకున్న వాళ్ల గురించి వారే చెబుతున్నారని రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు, హోం మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. బ్యాంకు మేనేజర్లు, ఎంట్రీ ఆపరేటర్ల సాయం ద్వారానే నల్లకుబేరులు యథేచ్ఛగా అక్రమలావాదేవీలు జరుపుతున్నారని, కొత్తనోట్లు పక్కదారి పట్టాయని వారు పేర్కొంటున్నారు.