: చంద్రబాబుకు అంతా తెలుసు... అన్నీ ముందే సర్దుకున్నారు: జగన్


పెద్ద నోట్లు రద్దు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలుసని... ఆయన, ఆయన అనుయాయులు అన్నీ ముందే సర్దేసుకున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. నోట్ల రద్దుకు సరిగ్గా రెండు రోజుల ముందు హెరిటేజ్ షేర్లను ఫ్యూచర్ గ్రూప్ కు ఆయన అమ్మేశారని... ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

పెద్ద నోట్ల రద్దు అనేది నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కాదని జగన్ విమర్శించారు. సామాన్యులను సైతం పన్నుల పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది జరుగుతోందని అన్నారు. రద్దయిన రూ. 14.5 లక్షల కోట్లలో... ఇప్పటికే రూ. 13 లక్షల కోట్లు వచ్చేశాయని... మిగిలిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ 90 శాతం నగదు ఆధారంగానే నడుస్తోందని అన్నారు.  

  • Loading...

More Telugu News