: బ్యాంకుల మాయాజాలం.. హమాలీని రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి చేసిన బ్యాంకు!
నవంబర్ 8 తరువాత బ్యాంకుల చిత్రాలు ఊహించనలవి కావడం లేదు. తాజాగా ఓ బ్యాంకులో ఖాతాదారు అయిన హమాలీ వర్కర్ ని రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గుర్రంకొండ మండలం అమిలేపల్లె గ్రామానికి చెందిన నజీర్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2 నెలల కిందట తమ గ్రామంలోని ఆంధ్రా బ్యాంకులో ఖాతా ప్రారంభించాడు. ఆయన ఖాతాలో నిన్నమొన్నటివరకూ కేవలం 192 రూపాయలు మాత్రమే ఉండేది.
ఈ నేపథ్యంలో తన ఖాతాలో 250 రూపాయలు జమ చేసేందుకు బ్యాంకు మిత్ర (బ్యాంకు శాఖలు లేని గ్రామీణ ప్రాంతాలలో వుండే బ్యాంకు ప్రతినిధి)కు డబ్బులిచ్చి ఇంటికెళ్లాడు. ఇంటికెళ్లిన తరువాత తన ఖాతాలో 1,26,76,686 రూపాయలు జమ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో షాక్ తిన్న నజీర్ బ్యాంకు మిత్రను సంప్రదించగా, 1,26,76,686 కోట్లు జమ అయినట్టు సిస్టంలో చూపించింది. దీంతో అధికారులకు నజీర్ సమాచారమందించాడు. దీంతో అంత మొత్తం ఎలా జమ అయిందో తమకూ తెలియదని తెలిపారు. దీంతో ఆదాయపన్ను శాఖాధికారులు రంగప్రవేశం చేసి అకౌంట్ ను సీజ్ చేశారు.