: మరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. కుక్ ను పెవిలియన్ చేర్చిన జడేజా


పరిస్థితి చూస్తూంటే చివరి టెస్టులో కూడా ఇంగ్లండ్ ఆటతీరు మారినట్టు కనిపించడం లేదు. కేవలం 21 పరుగులకే ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ఓపెనర్ జెన్నింగ్స్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔట్ కాగా... మరో ఓపెనర్ కెప్టెన్ కుక్ ను స్పిన్నర్ జడేజా పెవిలియన్ చేర్చాడు. జడేజా వేసిన బంతి ఎడ్జ్ తీసుకోగా, స్లిప్ లో ఉన్న కోహ్లీ దాన్ని సునాయాసంగా అందుకున్నాడు. ప్రస్తుతం రూట్ (21), మొయిన్ అలీ (5) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News