: అక్కినేని నాగార్జున ఆక్రమించుకున్న చెరువులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?: అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగారు. మిషన్ కాకతీయ తొలి దశలో ఎన్ని చెరువులు పునరుద్ధరించారని అడిగారు. ఫేజ్ 1లో జరిగిన పనులపై వివరాలు తెలపాలని ప్రశ్నించారు. సినిమా హీరోలను అభిమానులు ఓ రోల్ మోడల్‌గా తీసుకుంటారని, అటువంటి వారు అక్రమాలకు పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు.
ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్కినేని నాగార్జున ఆక్రమించుకున్న చెరువులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా అడిగారు. ఏ శక్తులు అడ్డుపడుతున్నాయో చెప్పాలని అన్నారు. ములుగు డివిజన్ అక్రమాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయా? అని అడిగారు. మిషన్ కాకతీయకు ఎంత డబ్బు కేటాయించారని, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. అందులో ఎన్ని అక్రమాలు జరిగాయని ప్రశ్నించారు. నిధుల కేటాయింపు, ఖర్చులపై లెక్కలు చెప్పాలని కోరారు.