: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కాసేపట్లో ఇంగ్లండ్-భారత జట్ల మధ్య ఈ సిరీస్ లో చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్ కు అనుకూలించే ఈ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేయడం ద్వారా లబ్దిపొందవచ్చని ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ భావిస్తున్నాడు. కాగా, వర్షంతో తడిసిన పిచ్ పై టర్న్ ను అనుకూలంగా మార్చుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.
ఈ నేపథ్యంలో చివరి టెస్టు ఆసక్తికరంగా జరుగుతుందని రెండు జట్లు భావిస్తున్నాయి. కాగా, ఇప్పటికే సిరీస్ టీమిండియా వశం కావడంతో రెండు జట్లపై ఎలాంటి ఒత్తిడి లేదు. అదనపు విజయం కోసం టీమిండియా ప్రయత్నించనుండగా, చివరిదైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, స్వేచ్ఛగా ఆడుతామని ఇంగ్లండ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సిరీస్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ రికార్డులు, రేటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రెండు జట్లు జాగ్రత్తగా ఆడనున్నాయి.