: నరసరావు పేటలో జగన్ బహిరంగ సభ... పార్టీలో చేరనున్న కాసు మహేష్ రెడ్డి


గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత కాసు వెంకటకృష్ణా రెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సభపై గుంటూరు జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన చేరికతో గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తన కుమారుడు వైఎస్సార్సీపీలో చేరినా తాను మాత్రం పార్టీని వీడనని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కాసు వెంకటకృష్ణా రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పీసీసీ వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ లో కాసు కుటుంబం మనుగడ, వైఎస్సార్సీపీలో చేరికపై అక్కడ జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. 

  • Loading...

More Telugu News