: గవర్నర్ నివాసానికి దగ్గర్లోనే దారుణం... గుప్త నిధుల కోసం కట్టుకున్న భార్యనే చంపేశాడు
దురాశ, ముఢనమ్మకాలు మనుషులను రాక్షసులుగా మారుస్తున్నాయి. గుప్తనిధులు దక్కుతాయనే మూఢ విశ్వాసం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాదులోని రాజభవన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఎంఎస్ మక్తాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకంతో నిన్న అర్ధరాత్రి అఫ్జల్ బేగం అనే మహిళను ఆమె భర్త, కుమారుడు ఇద్దరూ కలిసి గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.