: నోట్ల రద్దుపై నేనే మాట్లాడతా... కాంగ్రెస్ కు ఎజెండానే లేదు: కేసీఆర్


తెలంగాణ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజున నోట్ల రద్దు గురించి చర్చించాలని నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, నోట్ల రద్దుపై శాసనసభలో తానే మాట్లాడతానని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలిపారు. సభలో చర్చంచడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఎజెండానే లేదని... అందువల్ల మనమే మాట్లాడాలని, మనకు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలని తన శ్రేణులకు సూచించారు. రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఏమేం చేశామో తెలియజేయడానికి అసెంబ్లీ సమావేశాలను వాడుకుందామని చెప్పారు.

బీఏసీ సమావేశానికి విపక్ష నేతలు కేవలం నాలుగైదు పాయింట్లు మాత్రమే పేపర్ పై రాసుకొచ్చారని... వారికి మాట్లాడటానికి ఇతర ఏ అంశాలు కూడా ఉన్నట్టు లేవని తెలిపారు. జీరో అవర్ లో నిక్కచ్చిగా ఉందామని... గడువులోగా ప్రశ్నలకు సమాధానాలు చెబుదామని మార్గనిర్దేశం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు పరిధిలోనే సమాధానం ఇద్దామని చెప్పారు. ఎవరు కూడా నోటి దురుసుకు వెళ్లవద్దని, హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశాలు అత్యంత కీలకమైనవని... అందువల్ల, ప్రతి సభ్యుడు కచ్చితంగా సామావేశాలకు హాజరుకావాల్సిందేనని ఆదేశించారు. మంత్రులు కంట్రోల్ లో ఉండాలని చెప్పారు. అవసరమైతే సమావేశాలను పొడిగిద్దామని తెలిపారు. 

  • Loading...

More Telugu News