: నకిలీ ఖాతాలు 20.. డిపాజిట్ రూ.60 కోట్లు


ఆదాయపు పన్నుశాఖ అధికారులు గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచ్‌లో నిర్వహించిన సోదాల్లో 20 నకిలీ ఖాతాలను గుర్తించారు. వీటిలో దాదాపు రూ.60 కోట్ల మేర డిపాజిట్ అయినట్టు తెలుసుకుని విచారణ చేపట్టారు. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్ అవుతున్న ఖాతాలపై దృష్టిసారించిన అధికారులు ఎడాపెడా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. జన్‌ధన్ ఖాతాల నుంచి అన్నింటిపైనా నిఘా పెట్టిన ఐటీ అధికారులు అనుమానాస్పద లావాదేవీలపై కన్నేశారు. ఫలితంగా కోట్లాది రూపాయల నల్లధనం బయటపడుతోంది. 

  • Loading...

More Telugu News