: మొబైల్ ద్వారా టీ బిల్లు చెల్లించిన హరియాణా ముఖ్యమంత్రి.. నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచేందుకే..
డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఓ టీస్టాల్‌లో కప్పు టీ తాగి మొబైల్ ద్వారా బిల్లు చెల్లించారు. గురువారం కర్నాల్ పట్టణంలోని బస్టాండ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడున్న ఓ టీకొట్టులో చాయ్ తాగారు. అనంతరం ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా టీ డబ్బులు చెల్లించారు. తర్వాత టీ కొట్టు యజమాని అకౌంట్‌లోకి డబ్బులు వచ్చిందీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తన స్టాల్ వద్ద స్వైపింగ్ మిషిన్ ఏర్పాటు చేసినట్టు టీస్టాల్ యజమాని ముఖ్యమంత్రికి వివరించాడు. ఈ సందర్భంగా అక్కడున్న వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వ్యాలెట్‌లు విరివిగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి సూచించారు.