: భారత్ ను ఇస్లాం దేశంగా మారుస్తాం: యూపీలో కొత్త పార్టీ
భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మారుస్తామంటూ కొత్తపార్టీ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక్కోపార్టీ ఒక్కోనినాదం ఎత్తుకుంటోంది. మతాలు, కులాల పేరిట ప్రజలను విభజిస్తూ ఓట్లు దండుకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఇస్లాం పార్టీ' పేరిట ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అజంగఢ్, ముబారక్ పూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న ఈ పార్టీ భారతదేశంలో ఇస్లాంరూల్ అమలు చేయడానికి ఒక మార్గం ఉందని పోస్టర్లు ఏర్పాటు చేసింది. ఈ పోస్టర్ లో ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అఫ్తాబ్ కమర్ అన్సారీ ఫోటోను కూడా ముద్రించడం విశేషం.