: ప్రధాని మోదీ ఈ దేశాన్ని ఫుట్ బాల్ లా మార్చేశారు: లాలూ ప్రసాద్


ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని ఫుట్ బాల్ లా మార్చేశారని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై లాలూ స్పందిస్తూ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించిందని విమర్శించారు. నల్లధనాన్ని అరికట్టడం, ఉగ్రవాదం, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం అనే మాటలన్నీ ఒట్టి మాటలేనని అర్థమైపోయిందన్నారు.

‘ప్రధాని మోదీ ఈ దేశాన్ని ఫుట్ బాల్ లాగా మార్చేశారు. ప్రధాని, మంత్రులు తలా ఒక వైపు తన్నుతుంటే.. మరో వైపు ఆర్బీఐ లేదా ఆర్థిక శాఖ వాటి కిక్ లు అవి ఇస్తున్నాయి. మోదీజీ.. మీరు, మీ మంత్రులు ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. అంతేకానీ, ఫుట్ బాల్ ఆడటం లేదు’ అంటూ ఆ ట్వీట్ లో లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News