: డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి రెండు పథకాలు: నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలు ప్రవేశపెట్టనుందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నగదురహిత లావాదేవీల ప్రోత్సాహకానికి లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజనలను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచే ఈ రెండు పథకాలను అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. లక్కీ గ్రాహక్ యోజన కింద ప్రతిరోజు 15 వేల మంది విజేతలను ఎంపిక చేసి, వారికి ప్రోత్సాహకంగా రూ.1000 అందిస్తామని చెప్పారు. డిజిధన్ వ్యాపారి యోజన కింద వారానికి ఒకసారి 7 వేల మందిని ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తామని చెప్పారు.