: గ్యాంగ్ రేప్ వ్యాఖ్యలకు బేషరతు క్షమాపణలు చెప్పిన ఎస్పీ మంత్రి.. ఆమోదించిన సుప్రీంకోర్టు!


తాను చేసిన గ్యాంగ్ రేప్ వ్యాఖ్యల పట్ల ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. బులంద్ షహర్ ప్రాంతంలో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ ను ఉద్దేశిస్తూ... ఇదంతా ఓ రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీ ప్రతిష్టను మంటగలపడానికే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇటీవల మంత్రి కోర్టుకు క్షమాపణలు చెప్పినప్పటికీ అవి బేషరతుగా లేకపోవడంతో వాటిని తిరస్కరించింది. తాజాగా ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో సుప్రీంకోర్టు ఆమోదించింది.

  • Loading...

More Telugu News