: పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలనిపిస్తోంది: అద్వానీ
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరుపట్ల బీజేపీ అగ్రనేత అద్వానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశాలు సజావుగా జరకపోవడం పట్ల నిర్వేదం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమంటూ తన సహచర బీజేపీ ఎంపీల వద్ద ఆయన వ్యాఖ్యానించారు. ఉభయసభలు జరుగుతున్న తీరు చూస్తుంటే... సభలో ఉండటం కన్నా ఎంపీ పదవికి రాజీనామా చేయడమే మేలనిపిస్తోందని ఆయన అన్నారు. బాధ్యత గల ఎంపీలు ప్రజాసమస్యలపై చర్చించకుండా... సమావేశాలను తప్పుదారి పట్టించడం సరికాదని వ్యాఖ్యానించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ ఒక్కటి కూడా జరగకపోవడం గమనార్హం. కొత్తనోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఉభయసభలనూ ప్రతిరోజూ స్తంభింపజేస్తున్నాయి.