: కుమార్తె పెళ్లి సందర్భంగా నిరుపేదలకు 90 ఇళ్లను బహూకరించాడు!
కొంత మందికి ఎంత సంపద ఉన్నా సరిపోదు. ఇంకా కావాలంటారు. మరికొందరు తోటి వ్యక్తులకు ఏదో ఒక సహాయం చేయాలని తపన పడుతుంటారు. రెండో కోవకు చెందిన వ్యక్తే ఇతను. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని లాసార్ పట్టణంలో నివాసం ఉంటాడు. అతని పేరు అజయ్ మునాట్. వస్త్రాలు, గోధుమల హోల్ సేల్ వ్యాపారం చేస్తుంటాడు. తన కుమార్తె పెళ్లి సందర్భంగా 90 మంది నిరుపేదలకు సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. 2 ఎకరాల స్థలంలో రూ. 1.5 కోట్ల ఖర్చుతో ఆయన వీటిని నిర్మించారు.
అయితే ఈ ఇళ్లను మంజూరు చేయడానికి ఆయన మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మొదటిది లబ్ధిదారుడు పేదవాడై ఉండాలి. రెండోది అతను మురికివాడలో నివసిస్తూ ఉండాలి. మూడోది, అతనికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండరాదు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ, తన కుమార్తె వివాహానికి తాను ఎక్కువ ఖర్చు చేయలేదని... ఖరీదైన హోటల్ రూమ్స్ ను బుక్ చేయలేదని చెప్పారు. ఆ ఖర్చుతో పేదవారికి ఇళ్లను కట్టించి ఇచ్చానని గర్వంగా చెప్పారు.