: జాగిలానికి నీరు తాగించి, ప్రేమగా తల నిమిరిన కోహ్లీ!
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది మైదానం లోపల, బయట ఈరోజు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది తమ జాగిలాలతో మైదానంలో కలియతిరిగారు. అయితే, ప్రాక్టీస్ అనంతరం కోహ్లీ అక్కడే ఉన్న ఒక జాగిలం వద్దకు వెళ్లాడు. తన చేతిలోని వాటర్ బాటిల్ లోని నీటిని దానికి తాగిస్తూ, ప్రేమగా దాని తల నిమిరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.