: మోదీది నకిలీ డిగ్రీ... నిజమైన డిగ్రీ అయితే చూపించమనండి: కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు


ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ డిగ్రీ నకిలీదని ఆయన ఆరోపించారు. తాను కాలేజీకి వెళ్లలేదంటూ గతంలో మోదీ చెప్పారని... ఆ తర్వాత కరెస్పాండెన్స్ ద్వారా డిగ్రీ చేసినట్టు చెప్పారని... ఆ డిగ్రీ ఒరిజినల్ కాదు నకిలీ అని విమర్శించారు. ఒక వేళ ఆ డిగ్రీ ఒరిజినల్ అయితే, పూర్తి వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు గుజరాత్ హైకోర్టులో మోదీ డిగ్రీకి సంబంధించిన విచారణ జరగనుందని... ఈ సందర్భంగా మోదీ డిగ్రీని చూపించేందుకు తాము సిద్ధమంటూ మోదీ తరపు న్యాయవాది కోర్టులో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకుల్లో జమ అయిన డబ్బుతో... రైతులు, చిన్న వ్యాపారుల లోన్లను తీర్చాలని డిమాండ్ చేశారు. ధనవంతులైన మోదీ స్నేహితుల లోన్లను తీర్చడానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా ఒప్పుకోమని అన్నారు.

  • Loading...

More Telugu News