: ఈ సారి 20 పని దినాలపాటు తెలంగాణ శాసనసభ నిర్వహణ.. బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్‌లో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. 20 పని దినాలపాటు శాసనసభ నిర్వహణకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. అవసరమైతే మరో వారం రజుల పాటు సభను పొడగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రేపు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుందని నేతలు తెలిపారు. సభ అర్థవంతంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.