: జయలలిత కు నివాళులర్పించనున్న క్రికెటర్లు
దివంగత సీఎం జయలలితకు క్రికెటర్లు నివాళులర్పించనున్నారు. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన 5వ టెస్టు రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించి మ్యాచ్ ఆడనున్నారు. ఈ మేరకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్ సీఏ) నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా టీఎన్ సీఏ అధికారులు మాట్లాడుతూ, జయలలిత మృతికి నివాళులర్పిస్తూ, గౌరవ సూచకంగా ఇరు దేశాల జట్ల ఆటగాళ్లు తమ మోచేతులకు బ్లాక్ బ్యాండ్ ను ధరించి మ్యాచ్ లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.