: పంజాబ్ లో జమ్ముకశ్మీర్ రిజిస్ట్రేషన్ కారు... హైఅలర్ట్


పంజాబ్ లోని పఠాన్ కోట్ సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే, జమ్ముకశ్మీర్ రిజిస్ట్రేషన్ తో కూడిన ఓ కారును పఠాన్ కోట్ సమీపంలోని ఫర్ఫల్ గ్రామానికి సమీపంలో స్థానికులు గుర్తించారు. దీంతో దుండగులు ఆ కారుకు తాళం వేసి, అక్కడ నుంచి క్షణాల్లో పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పఠాన్ కోట్ సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పరారైన దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News