: షిర్డీలో భక్తులకు, సిబ్బందికి మధ్య ఘర్షణ..ఆరుగురికి గాయాలు


షిర్డీలో భక్తులకు, భద్రతా సిబ్బందికి మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. షిర్డీ దేవాలయం సమీపంలో సాయినాథుడి ఊరేగింపు కొనసాగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లపై కొందరు భక్తులు కూర్చున్నారు. అక్కడ కూర్చోవద్దని పోలీసులు చెప్పడంతో గొడవ మొదలై ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News