: తుపాను తర్వాత చెన్నై పిచ్ కు సంప్రదాయ పద్ధతిలో రిపేర్లు!
వార్దా తుపాను చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. తుపాను తాకిడికి చెన్నైలోని చెపాక్ క్రికెట్ గ్రౌండ్ కూడా తడిసిముద్దయింది. ఈ నేపథ్యంలో, స్టేడియంలోని పిచ్ కూడా తడిసింది. దీంతో, పిచ్ పై ఉన్న తేమను తొలగించడానికి ఎప్పటినుంచో పాటిస్తున్న సంప్రదాయ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఇనుప ట్రేలలో ఎర్రగా కాలుతున్న బొగ్గులను వేసి... వాటి కింద స్టంప్స్ ను ఉంచి, పిచ్ పై అటూ, ఇటూ తిప్పుతున్నారు. దీంతో, పిచ్ దెబ్బతినకుండా, స్టంప్స్ ద్వారా వేడి పిచ్ లోకి చేరుతోంది. ప్రస్తతం పిచ్ పరిస్థితి మెరుగైందని సౌత్ జోన్ క్యూరేటర్ విశ్వనాథన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ పిచ్ ఎలా సహకరిస్తుందన్న విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.