: బ్యాంకుల ముందు క్యూలో చెప్పులు .. ఇదో నయా రిజర్వేషన్!


రోజులు గడుస్తున్నా జనాల కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద డబ్బు కోసం జనాలు పడిగాపులు పడుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద లైన్లలో గంటల తరబడి నిలబడటం పరిపాటి అయింది. అయితే, ఎప్పుడో వచ్చే డబ్బుకోసం రోజంతా ఎండలో లైన్లో ఎందుకు నిలబడాలి అనుకుని, తమ స్థానంలో చెప్పులు పెట్టి... చెట్ల కింద సేదతీరుతున్నారు జనాలు. డబ్బులు వచ్చిన వెంటనే వచ్చి పని పూర్తికానిస్తున్నారు. ఈ సన్నివేశం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేడీసీసీ బ్యాంకు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఈ వేకువజామునే ఖాతాదారులు బ్యాంకు వద్దకు భారీగా చేరుకుని, క్యూలో నిల్చున్నారు. ఎండ రావడంతో చెట్ల కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని... క్యూలో తమ బదులు చెప్పులు పెట్టారు. ఈ రకంగా అందరూ చెట్ల కిందకు చేరడంతో... క్యూలో కేవలం చెప్పులు మాత్రమే మిగిలాయి.

  • Loading...

More Telugu News