: మోదీ బాటలో ఆస్ట్రేలియా... పెద్ద నోటు రద్దు?


భారత ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి. మరి కొన్ని దేశాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వెనిజులాలో అక్కడి పెద్ద నోటు అయిన 100 బొలివర్ నోటును రద్దు చేశారు. ఇప్పుడు ఇదే దారిలో మరో దేశం పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేమీ చిన్నాచితకా దేశం కాదు. అత్యంత అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా!

తమ దేశంలో పెద్ద నోటు అయిన 100 డాలర్ల నోటును రద్దు చేసే దిశగా అక్కడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా రెవెన్యూ, ఆర్థిక సర్వీసుల శాఖ మంత్రి కెల్లీ ఓ డ్వెయిర్ తెలిపారు. నల్లధనాన్ని నియంత్రించే క్రమంలో 100 డాలర్ల నోటు రద్దు, ఇతర నగదు లావాదేవీలను సమీక్షిస్తామని ఆయన చెప్పారు. రానున్న సోమవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే, నరేంద్ర మోదీ నోట్ల రద్దును చివరి నిమిషంలో ప్రకటిస్తే... ఆస్ట్రేలియా మాత్రం ముందుగానే సూచనప్రాయంగా తెలిపింది.

  • Loading...

More Telugu News