: కలెక్టర్ల సదస్సులో నవ్వులు పూయించిన ముఖ్యమంత్రి కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్ధాటి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, సమయానుకూలంగా ఛలోక్తులు విసరడంలో కూడా కేసీఆర్ దిట్ట. తాజాగా నిన్న జిల్లా కలెక్టర్లతో జరిగిన సదస్సులో కలెక్టర్లతో పాటు, నాయకులందరీనీ తనదైన శైలితో కేసీఆర్ నవ్వించారు. సిద్ధిపేటలో నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ లేచి నిలబడి... "కలెక్టర్ గారూ, మాది గజ్వేల్ అండి. అంతేకాదు, గజ్వేల్ ఎమ్మెల్యేని కూడా. నగదు రహితంపై మీరు మా నియోజకవర్గాన్ని కూడా కొంచెం పట్టించుకోవాలి" అన్నారు. దీంతో, అక్కడున్న వారంతా మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.

  • Loading...

More Telugu News