: జయ సమాధి వద్ద తలనీలాలు ఇవ్వడం అయిపోయింది... ఇప్పుడు పెళ్లిళ్లు మొదలయ్యాయి!


పురచ్చితలైవి జయలలిత మరణం తర్వాత అప్పటి దాకా ఆమెకు సాష్టాంగప్రమాణాలు చేసిన అన్నాడీఎంకే నేతల్లో మార్పు వచ్చిందోమో కానీ... అభిమానుల గుండెల్లో మాత్రం అమ్మ అలాగే నిలిచి ఉంది. పలువురు అభిమానులు జయ మరణం తర్వాత కూడా ఏదోరకంగా ఆమెపై తమ ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే జయ సమాధి వద్ద వందలాది మంది అభిమానులు తలనీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె సమాధి వద్ద ఏకంగా పెళ్లిళ్లు కూడా స్టార్ట్ అయ్యాయి.

అన్నాడీఎంకే యువజన విభాగం నాయకుడు ఫ్రాన్సిస్ కు రెజీలా ప్రీతి అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 1న వివాహం జరగాల్సి ఉంది. జయకు ఆహ్వాన పత్రం పంపగా... వివాహానికి తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చారట. అయితే అనూహ్యంగా జయలలిత తుదిశ్వాస విడవడంతో... ఫ్రాన్సిస్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. వధువు రెజీలా కుటుంబాన్ని, తన కుటుంబాన్ని జయ సమాధి వద్దకు తీసుకెళ్లాడు ఫ్రాన్సిస్. అక్కడే ఇద్దరూ దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. నూతన వధూవరులను అక్కడున్న అందరూ ఆశీర్వదించారు. జయ ఆశీస్సులతోనే తమ పెళ్లి జరిగిందని భావిస్తున్నట్టు ఫ్రాన్సిస్ తెలిపాడు. అమ్మ సమాధి వద్ద పెళ్లి చేసుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News