: జయంత్ యాదవ్ సెంచరీ చేస్తున్న సమయంలోనే... అతని అమ్మమ్మ కన్నుమూసింది!


ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టులో యువ ఆటగాడు జయంత్ యాదవ్ అద్భుతమైన సెంచరీ చేసిన విషయం తెలిసిందే. తాను ఆడుతున్న మూడో టెస్టులోనే అతను ఈ ఘనతను సాధించాడు. సెంచరీకి చేరువలో జయంత్ ఉన్నప్పుడు... ఇంటి వద్ద ఉన్న అతని కుటుంబసభ్యులు మాత్రం విషాదంలో మునిగిపోయారు. అప్పటిదాకా టీవీలో తన కుమారుడి ఆటను ఆస్వాదిస్తున్న అతని తండ్రి జైసింగ్ యాదవ్ కు ఓ ఫోన్ వచ్చింది. అత్తయ్య (జయంత్ అమ్మమ్మ) చనిపోయారనేది ఆ ఫోన్ సారాంశం. దీంతో, తాను జలంధర్ బయల్దేరానని... కాసేపటికే జయంత్ సెంచరీ పూర్తి చేశాడని ఫోన్ వచ్చిందని అతను తెలిపారు. కుమారుడు సెంచరీ చేసినందుకు సంతోషించాలో, తన అత్తమ్మ చనిపోయినందుకు బాధపడాలో తెలియలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయంత్ కు చెబితే, అతను ఏకాగ్రత కోల్పోతాడని, ఈ విషయాన్ని వెంటనే అతనికి చెప్పలేదని తెలిపారు. మరోవైపు, జయంత్ తల్లి 17 ఏళ్ల క్రితం ఓ విమాన ప్రమాదంలో మరణించారు.

  • Loading...

More Telugu News