: ట్రంప్ తర్వాతి స్థానం పీవీ సింధుదే!


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానాన్ని ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధు ఆక్రమించింది. ట్రంప్ కు, సింధుకు లింక్ ఏమిటనుకుంటున్నారా? ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో ట్రంప్ తొలిస్థానంలో నిలిచారు. ట్రంప్ తర్వాత ఎక్కువ మంది వెతికింది మన సింధునే. అంతేకాదు... టాప్-10లో ఏడు స్థానాల్లో ఇండియానే ఉంది. ఒలింపిక్స్ లో సత్తా చాటిన దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో, రెజ్లర్ సాక్షి మాలిక్ పదో స్థానంలో నిలిచారు. ధోనీ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ దిషా పటానీ 5వ స్థానాన్ని ఆక్రమించింది. బాలీవుడ్ మరో భామ ప్రియాంకాచోప్రా 7వ స్థానంలో నిలిచింది. నోట్ల రద్దు అంశం, సర్జికల్ స్ట్రైక్స్ లు 7, 8 స్థానాల్లో నిలిచాయి. 

  • Loading...

More Telugu News