: నేటితో కనుమరుగు కానున్న పాత రూ. 500 నోటు


పాత రూ. 500 నోటుకు నేటితో కాలం చెల్లిపోనుంది. ఈ అర్ధరాత్రి వరకే ఆ నోటు చెల్లుబాటుకానుంది. అదికూడా ప్రభుత్వ సర్వీసుల చెల్లింపులు, మెడికల్ షాపుల్లోనే. నోట్ల వినియోగానికి విధించిన డిసెంబర్ 15వ తేదీ గడువును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, రేపటి నుంచి మెడికల్ షాపులు, విద్యుత్, కరెంట్ తదితర బిల్లుల చెల్లింపులు, పెట్రోల్ బంకులు మొదలైన చోట్ల కూడా రూ. 500 నోటు చెల్లదు. వాస్తవానికి నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం... ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వ సర్వీసులతో పాటు మరికొన్ని చోట్ల 72 గంటల పాటు పెద్ద నోట్లను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కానీ, ప్రజా అవసరాల దృష్ట్యా డిసెంబర్ 15 వరకు డెడ్ లైన్ కొనసాగింది. 

  • Loading...

More Telugu News